సోమవారం 01 జూన్ 2020
National - May 21, 2020 , 15:06:00

నేపాల్‌కు వ్యతిరేకంగా నేపాలీ కార్మికుల ఆందోళన

నేపాల్‌కు వ్యతిరేకంగా నేపాలీ కార్మికుల ఆందోళన

డెహ్రాడూన్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో భారత్‌ నుంచి స్వదేశానికి వెళ్తున్న నేపాలీలకు నేపాల్‌ ప్రభుత్వం అనుమతించడం లేదు. దీంతో స్వదేశానికి వెళ్లడానికి సరిహద్దులకు చేరకున్న ప్రజలు నేపాల్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 500 మంది నేపాలీలు ఉత్తరాఖండ్‌లోని బన్‌బాసా, చంపావత్‌ చేరుకున్నారు. వారిని నేపాల్‌లోకి ప్రవేశించడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సరిహద్దుల్లో ఆందోళనకు దిగారు. ఈ విషయానికి సంబంధించి ఉత్తరఖండ్‌ అధికారులు నేపాల్‌ ప్రభుత్వానికి సమాచారం అందిస్తామని వెల్లడించారు. 


logo