శనివారం 04 జూలై 2020
National - Jun 16, 2020 , 02:02:25

విమాన సర్వీసులపై జూలై 5 వరకు నేపాల్‌ నిషేధం

విమాన సర్వీసులపై జూలై 5 వరకు నేపాల్‌ నిషేధం

కఠ్మాండు: కరోనా నేపథ్యంలో నేపాల్‌ ప్రభుత్వం జూలై 5 వరకు జాతీయ, అంతర్జాతీయ ప్రయాణ విమాన సర్వీసుల నిర్వహణపై నిషేధాన్ని పొడిగించింది. నేపాల్‌లో కరోనా కేసులు 6000 దాటిన నేపథ్యంలో విమాన సర్వీసుల నిర్వహణను  నిలిపివేయాలని క్యాబినెట్‌ నిర్ణయించిందని నేపాల్‌ పౌర విమానయాన సంస్థ  తెలిపింది. ఇతర దేశాలవారిని తరలించేందుకు, అత్యవసర వస్తువుల సరఫరాకు రవాణా విమానాలను అనుమతినిస్తున్నామని పేర్కొన్నది.logo