గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 10, 2020 , 01:35:55

చీలిక దశగా నేపాల్‌ కమ్యూనిస్టులు!

చీలిక దశగా నేపాల్‌ కమ్యూనిస్టులు!

  • ప్రధాని ఓలీతో ప్రచండ చర్చలు విఫలం

కఠ్మాండు: నేపాల్‌లోని అధికార కమ్యూనిస్టు పార్టీ చీలిక దిశగా పయనిస్తున్నది. భారత్‌ వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్న ప్రధాని కేపీ శర్మ ఓలీతో నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (ఎన్సీపీ) ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పుష్ప కమల్‌ దహల్‌ ‘ప్రచండ’ ఆరు దఫాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. బుధవారం జరుగాల్సిన ఎన్సీపీ స్థాయీ సంఘం భేటీ శుక్రవారానికి వాయిదా పడింది. ప్రధాని ఓలీ వ్యతిరేక వర్గం.. ఆయన రాజీనామాకు పట్టుబడుతున్నది. ఓలీ వ్యతిరేక వర్గానికి ప్రచండ సారథ్యం వహిస్తున్నారు. కాగా తమ నేతలతో చైనా రాయబారి సంప్రదింపులు జరుపడం నేపాల్‌ అంతర్గత వ్యవహరాల్లో జోక్యం చేసుకోవడమేనని ఎన్సీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. 


logo