గురువారం 28 జనవరి 2021
National - Dec 22, 2020 , 18:57:08

యూకేకు విమానాల రాక‌పోక‌ల‌పై నేపాల్ నిషేధం

యూకేకు విమానాల రాక‌పోక‌ల‌పై నేపాల్ నిషేధం

ఖాట్మండు: ‌యునైటెడ్ కింగ్‌డ‌మ్‌కు (యూకేకు) విమానాల రాక‌పోక‌ల‌పై నేపాల్ నిషేధం విధించింది. ఈ మేర‌కు నేపాల్ సివిల్ ఏవియేష‌న్ అథారిటీ ఒక ప్ర‌క‌ట‌న చేసింది. యూకేలో క‌రోనా వైర‌స్ ఉత్ప‌రివ‌ర్త‌నం చెంది వేగంగా విస్త‌రిస్తుండ‌టంతో అక్క‌డ కేసుల సంఖ్య మ‌ళ్లీ విస్త‌రిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో భార‌త్ స‌హా ప‌లు దేశాలు ఇప్ప‌టికే యూకేకు విమానాల రాక‌పోక‌ల‌పై నిషేధం విధించాయి. ఈ నేప‌థ్యంలో నేపాల్ కూడా యూకేకు విమానాల రాక‌పోక‌ల‌పై నిషేధం విధిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. డిసెంబ‌ర్ అర్ధరాత్రి 11.59 గంట‌ల నుంచి నిషేధం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని నేపాల్ సివిల్ ఏవియేష‌న్ అథారిటీ వెల్ల‌డించింది.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo