బుధవారం 27 జనవరి 2021
National - Dec 30, 2020 , 01:12:18

రద్దుపైనే చర్చలు జరగాలి

రద్దుపైనే చర్చలు జరగాలి

కేంద్రానికి రైతు సంఘాల లేఖ

న్యూఢిల్లీ: నెల రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనోద్యం చేస్తున్న రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం లేఖ రాశాయి. కొత్త వ్యవసాయ చట్టాల రద్దుకు, కనీస మద్దతు ధర కోసం చట్టబద్ధమైన గ్యారంటీకి అనుసరించే పద్ధతులపై మాత్రమే బుధవారం చర్చలు జరగాలని స్పష్టం చేశాయి. ఢిల్లీ రాజధాని ప్రాంత ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ నిర్దేశించిన నిబంధనలు, శిక్షల నుంచి రైతులను మినహాయించేలా సవరణలు చేయడం, విద్యుత్తు సవరణ బిల్లును ఉపసంహరించడం కూడా ఎజెండాలో ఉండాలని తెలిపాయి. ఈ చర్చల నేపథ్యంలో గురువారం తలపెట్టిన ట్రాక్టర్ల మార్చ్‌ను రైతు సంఘాలు వాయిదా వేశాయి. మరోవైపు, కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌& బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిశారు. రైతులతో చర్చలకు సంబంధించి ప్రభుత్వ వైఖరిని ఈ భేటీలో ఖరారు చేసినట్లు సమాచారం.


logo