మంగళవారం 31 మార్చి 2020
National - Feb 25, 2020 , 13:49:18

భారీ వాణిజ్య ఒప్పందానికి అంగీక‌రించాం : ప‌్ర‌ధాని మోదీ

భారీ వాణిజ్య ఒప్పందానికి అంగీక‌రించాం : ప‌్ర‌ధాని మోదీ


హైద‌రాబాద్‌:  ఢిల్లీలోని హైద‌రాబాద్ హౌజ్‌లో ట్రంప్‌తో జ‌రిగిన ద్వైపాక్షిక చ‌ర్చ‌ల అనంత‌రం సంయుక్త మీడియా స‌మావేశంలో ప్ర‌ధాని మోదీ మాట్లాడారు.  భార‌త్‌, అమెరికా భాగ‌స్వామ్యానికి చెందిన కీల‌క విష‌యాల‌ను చ‌ర్చించామ‌ని మోదీ అన్నారు.  ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌, ఎన‌ర్జీ, వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం, వాణిజ్యం, ప్ర‌జ‌ల సంబంధాల గురించి మాట్లాడామ‌న్నారు. ర‌క్ష‌ణ రంగంలో బ‌లోపేతం కావ‌డ‌మే కీల‌క‌మైన అడుగ‌న్నారు.  ఉగ్ర‌వాదానికి కార‌ణ‌మైవారిని, మ‌ద్ద‌తు ఇచ్చేవారి ప‌ట్ల క‌ఠిన చ‌ర్య‌లు రెండు దేశాలు అంగీక‌రించాయ‌న్నారు. వాణిజ్య ఒప్పందాలపై మా శాఖా మంత్రులు పాజిటివ్‌గా చ‌ర్చ‌లు నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు. ఆ చ‌ర్చ‌ల‌కు న్యాయ ప్ర‌క్రియ జోడించాల‌న్నారు. రెండు దేశాల మ‌ధ్య బంధం ప్ర‌భుత్వాల మ‌ధ్య ఉన్న బంధం మాత్ర‌మే కాదు అని, ఇది ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న బంధం అని మోదీ అన్నారు. 


logo
>>>>>>