కావలసిన పదార్థాలు:
కోడిగుడ్లు: ఎనిమిది, కార్న్‌ఫ్లోర్: పావు కప్పు, నూనె: సరిపడా, మైదా: పావు కప్పు, చిల్లీ ఫ్లేక్స్: అర టీ స్పూన్, బ్రెడ్ క్రంబ్స్: రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత, మిరియాల పొడి: అర టీ స్పూన్.
తయారీ విధానం:
ముందుగా ఒక పాత్రలో ఆరు కోడిగుడ్లు కొట్టి అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకుని నూనె రాసి, అందులో కోడిగుడ్ల మిశ్రమం పోసి ఆవిరిపై అరగంటపాటు ఉడికించాలి. బాగా ఉడికి ఊతప్పంలా మారిన గుడ్ల మిశ్రమాన్ని నెమ్మదిగా బయటకు తీసి, పొడవుగా ఫింగర్స్ మాదిరిగా కట్ చేయాలి. మరొక పాత్రలో కార్న్‌ఫ్లోర్, మైదా, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలపాలి. ఒక గిన్నెలో రెండు గుడ్లు కొట్టి చిటికెడు ఉప్పు వేసి కలపాలి. కట్ చేసి పెట్టుకున్న ఫింగర్స్‌ను పిండి మిశ్రమంలో అద్దుతూ, కోడిగుడ్డు సొనలో ముంచి బ్రెడ్ క్రంబ్స్ అద్దాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె పోసి వేడయ్యాక బ్రెడ్ క్రంబ్స్ అద్దిన ఫింగర్స్‌ను వేసి, వేయిస్తే ‘ఎగ్ ఫింగర్స్’ రెడీ.