బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 26, 2020 , 16:43:24

నీట్‌-2020 ఆన్స‌ర్ కీ విడుద‌ల‌

నీట్‌-2020 ఆన్స‌ర్ కీ విడుద‌ల‌

ఢిల్లీ : నీట్‌-2020 ప్రాథ‌మిక‌ ఆన్స‌ర్ కీ ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నేడు విడుద‌ల చేసింది. అభ్య‌ర్థులు ntaneet.nic.in, www.nta.ac.in.కు లాగినై ఆన్స‌ర్ కీ ద్వారా త‌మ స్కోర్‌ను చూసుకోవ‌చ్చు. E1 నుండి E6 వ‌ర‌కు అదేవిధంగా F1 నుండి F6, G1 నుండి G6, H1 నుండి H6 కోడ్‌ల‌కు సంబంధించి ఆన్స‌ర్ కీ ని విద్యార్థులు చెక్‌చేసుకోవ‌చ్చు. నీట్ పరీక్షను 2020 సెప్టెంబర్ 13న నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. త‌ప్పుడు స‌మాధానాల‌ను స‌వాల్ చేసే నోటీసును అతిత్వ‌ర‌లోనే వెబ్‌సైట్‌లో పొందుప‌ర‌చ‌నున్నట్లు ఎన్‌టీఏ పేర్కొంది. వైద్య‌, అనుబంధ కోర్సుల్లో ప్ర‌వేశానికి నిర్వ‌హించే నీట్ ప‌రీక్ష‌కు ఈ ఏడాది 15.97 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 3,843 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. అన్ని ఫార్మాట్ల‌లో అభ్యంత‌రాల‌ను లేవ‌నెత్త‌డంతో పాటు సంబంధిత ప‌త్రాల‌ను అప్‌లోడ్ చేయాల్సిందిగా ఎన్‌టీఏ సూచించింది. ఫైన‌ల్ ఆన్స‌ర్ కీ, త‌దుప‌రి స‌మాచారం కోసం అభ్య‌ర్థులు ఎప్ప‌టిక‌ప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శిస్తుండాల‌ని పేర్కొంది. 


logo