శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 17:22:00

భారత్‌లో జనాభా నియంత్రణ చట్టం అవసరం..

భారత్‌లో జనాభా నియంత్రణ చట్టం అవసరం..

న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ నిలువాలంటే జనాభా నియంత్రణ చట్టం అవసరమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన మాట్లాడారు. ‘దేశంలో జనాభా పెరుగుదల సవాల్‌గా మారింది. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అభివృద్ధి చెందిన దేశాల సరసన మనం నిలువాలంటే జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి. దేశంలోని అన్ని మతాల ప్రజలకు వర్తించే విధంగా జనాభాను కఠినంగా నియంత్రించగలిగే చట్టం మనకు అవసరం’ అని అన్నారు.

ప్రపంచ జనాభాలో మనం 18 శాతం అని మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు. అదే సందర్భంలో 2 శాతం భూమి, 4 శాతం నీరు మాత్రమే మనకు ఉన్నదన్నారు. ఈ నేపథ్యంలో జనాభా నియంత్రణ చట్టం అత్యవసరమన్నారు. అధిక జనాభా వల్ల కొన్ని లాభాలతోపాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయన్నారు.logo