ఆదివారం 31 మే 2020
National - May 22, 2020 , 16:20:39

సెలూన్‌కి వెళ్లకుండానే పర్‌ఫెక్ట్‌ హెయిర్‌కట్‌ : వీడియో వైరల్‌

సెలూన్‌కి వెళ్లకుండానే పర్‌ఫెక్ట్‌ హెయిర్‌కట్‌ : వీడియో వైరల్‌

ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్‌ ఉంటుంది. ఒకరు చేసిన పనిని మరొకరు చేయలేరు. హెయిర్‌కట్‌ చేయాలంటే బార్బర్‌కే సాధ్యం. సాధారణ మనుషులెవ్వరూ ఆ పనిని పర్‌ఫెక్ట్‌గా చేయలేరు. అయితే.. ఇంట్లో ఉండే వస్తువులతో పర్‌ఫెక్ట్‌ హెయిర్‌స్టైల్‌ చేశాడో వ్యక్తి. అదెలా చేశాడో కూడా స్టెప్‌ బై స్టెప్‌ వీడియో ద్వారా వివరణ ఇచ్చాడు.

కరోనా దెబ్బకి సెలూన్‌కి వెళ్లాలంటేనే జనాలు హడలి పోతున్నారు. ఇలానే ఉంటే జడ వేసుకొనే పరిస్థితి వస్తుంది. అందుకే ఇంట్లోనే సింపుల్‌గా, సొంతంగా హియిర్‌కట్‌ చేసుకోమంటున్నాడు ఈ జెంటిల్‌మెన్‌. అదెలాగంటే.. ఒక న్యూస్‌ పేపర్‌ తీసుకొని దానికి మధ్యలో గుండ్రంగా కట్‌ చేసుకోవాలి. ఆ రంధ్రం ద్వారా తలని దూర్చాల్చి. జుట్టు శరీరంపై పడకుండా సెలూన్‌లో వాడే క్లాత్‌ మాదిరిగా అన్నమాట. ఆ తర్వాత ఒక దువ్వెన, బ్లేడ్‌, క్లిబ్‌ తీసుకున్నాడు. దువ్వెన, బ్లేడ్‌ను హెచ్చు తగ్గులుగా పెట్టి క్లిబ్‌ని అటాచ్‌ చేయాలి. గట్టిగా ఫిక్స్‌ చేసిన తర్వాత హెయిర్‌స్టైల్‌ దువ్వుకున్నట్లు దువ్వుకుంటే పెరిగిన జుట్టంతా బ్లేడ్‌కు వచ్చేస్తుంది. చాలా సింపుల్‌గా ఈ జెంటిల్‌మెన్‌ తానంతట తానే హెయిర్‌కట్‌ చేసుకున్నాడు. ఈ వీడియోను  44,300 మంది వీక్షించారు. కామెంట్ల ద్వారా ఈయనికి అభినందనలు తెలుపుతున్నారు.logo