ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 15:11:28

లాక్‌డౌన్‌తో 86శాతం మంది స్వయం ఉపాధిపై ప్రభావం!

లాక్‌డౌన్‌తో 86శాతం మంది స్వయం ఉపాధిపై ప్రభావం!

చెన్నై : ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ఉద్యోగులపై కరోనా దారుణమైన ప్రభావాన్ని చూపింది. ఈ వైర‌స్ కార‌ణంగా దేశంలో కోట్లాది మంది తమ ఉపాధిని కోల్పోయారు. పరోక్షంగా మరింత మందిపై ప్రభావం పడింది. సీఎంఐఈ నివేదిక ప్రకారం.. కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా ఏప్రిల్‌ నుంచి జూలై వరకు కనీసం 1.9 కోట్ల మంది వేతనం పొందుతున్న భారతీయులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు తేలింది. అయితే అత్యంత దారుణంగా ప్రభావితమైన వారిలో మాత్రం స్వయం ఉపాధి పొందుతున్న వారున్నారని డిజిటల్ లెండింగ్ మార్కెట్ ప్లేస్, పైసాబజార్ ఇటీవల నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది.

సర్వే ప్రకారం.. స్వయం ఉపాధి పొందిన వినియోగదారుల్లో దాదాపు 86శాతం మంది లాక్‌డౌన్‌ సమయంలో ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపింది. 25శాతం మంది తమ ఆదాయం సున్నాకు పడిపోయిందని పేర్కొన్నారు. 37 నగరాల్లోని 24-57 మధ్య వయస్సు గల 8,616 మందిని పైసాబజార్‌ సర్వే చేసింది. సర్వేలో పాల్గొన్న వారందరికీ కనీసం రూ.లక్ష అప్పు ఉండేంది. సర్వేలో 16శాతం మంది తమ ఆదాయంలో 100శాతం నష్టపోయామని చెప్పగా.. 28శాతం మంది ఆదాయం ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం కారణంగా సగానికి సగం తగ్గిందని తేలింది. వేతన వినియోగదారులు ఎక్కువగా ప్రభావితమైనప్పటికీ, స్వయం ఉపాధి పొందుతున్న వారి కంటే తక్కువగా ప్రభావితమైనట్లు సర్వే వెల్లడించింది.

వేతన జీవుల్లో 44శాతం మంది తమ వేతనంపై ప్రతికూల ప్రభావం చూపలేదని, మరో 30శాతం మంది తమ వేతనాన్ని సగానికిపైగా తగ్గించినట్లు కూడా నివేదిక పేర్కొంది. దాదాపు 12 శాతం మంది వేతన వినియోగదారులు ఉద్యోగాన్ని నష్టపోవడంతో జీతం పూర్తిగా కోల్పోయినట్లు నివేదిక చెప్పింది. భౌగోళికంగా చెన్నై అతి తక్కువ ప్రభావం చూపగా.. ఆదాయం కోల్పోవడంలో ఢిల్లీ ఎన్‌సీఆర్‌పై అత్యధిక ప్రభావం ఉంది. చెన్నై నుంచి సర్వేలో పాల్గొన్న 48 శాతం మంది వినియోగదారులు ఆరోగ్య సంక్షోభం, ఫలితంగా విధించిన ఆంక్షల కారణంగా ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని చెప్పారు. 

ఢిల్లీ ఎన్‌సీఆర్‌ అత్యధికంగా ప్రభావితమైన నగరాల్లో 70శాతం మంది ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపిందని నివేదిక ఇచ్చారు. సంపూర్ణ ఆదాయం కోల్పోయిన కస్టమర్ల శాతం పరంగా ముంబైలో 26శాతం మంది ఆదాయం.. లోపభూయిషమైనదని నివేదించింది. కరోనా ప్రభావంతో 55శాతం మంది తమ రుణాలను పునర్వ్యవస్థీకరించడానికి రుణదాతలను సంప్రదించనున్నట్లు సర్వేలో తేలింది. మారటోరియం వినియోగించుకున్న వారిలో 70శాతం మంది లోన్‌ రీకాస్ట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటామని చెప్పారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo