మంగళవారం 31 మార్చి 2020
National - Feb 12, 2020 , 11:46:15

ట్రంప్‌కు స్వాగ‌తం ప‌ల‌క‌నున్న 70 ల‌క్ష‌ల మంది

ట్రంప్‌కు స్వాగ‌తం ప‌ల‌క‌నున్న 70 ల‌క్ష‌ల మంది

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈనెల 24వ తేదీన భార‌త్ రానున్న విష‌యం తెలిసిందే.  న్యూఢిల్లీతో పాటు ఆయ‌న అహ్మ‌దాబాద్‌లో ప‌ర్య‌టిస్తారు.  అక్క‌డ కొత్త‌గా నిర్మించిన మోతేరా స్టేడియంలో భారీ స‌భ‌లో ట్రంప్ ప్ర‌సంగించ‌నున్నారు. ఆ స‌భ కోసం ప్ర‌ధాని మోదీ భారీ ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. అహ్మ‌దాబాద్  విమానాశ్ర‌యం నుంచి స్టేడియం వ‌ర‌కు సుమారు 70  ల‌క్ష‌ల మంది స్వాగ‌తం ప‌లక‌నున్న‌ట్లు ట్రంప్ మీడియాతో వెల్ల‌డించారు. రెండు దేశాల మ‌ధ్య వాణిజ్య‌ప‌ర‌మైన ఒప్పందాలు కూడా కుద‌ర‌నున్నాయి.  ప్ర‌ధాని మోదీ మంచి వ్య‌క్తి అని,  భార‌తీయులు ఏదో ఒక మంచి ప‌ని చేయాల‌ని భావిస్తున్నార‌ని, అన్నీ కుదిరితే రెండు దేశాల మ‌ధ్య ఓ భారీ వాణిజ్య ఒప్పందం ఉంటుంద‌ని ట్రంప్ అన్నారు.logo
>>>>>>