మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Aug 08, 2020 , 16:51:16

కరోనా ధాటికి 196 మంది డాక్టర్లు మృతి

కరోనా ధాటికి 196 మంది డాక్టర్లు మృతి

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా మృతుల సంఖ్య 42 వేలకు పైగా చేరింది. కరోనా బాధితులకు వైద్యం అందించే వైద్యులు కూడా పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 196 మంది డాక్టర్లు చనిపోయినట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) శనివారం ప్రకటించింది. డాక్టర్ల ఆరోగ్యంపై కూడా ప్రధాని మోదీ దృష్టి సారించాలని ఐఎంఏ విజ్ఞప్తి చేసింది.

కరోనా బారిన పడుతున్న వైద్యుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రతి రోజు ఏదో ఒక చోట వైద్యులు చనిపోతున్నారు. ఇందులో అధికంగా జనరల్‌ వైద్యులు ఉన్నారు. వైద్యుల రక్షణ కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి ఐఎంఏ లేఖ రాసింది. అన్ని విభాగాల్లో పని చేసే డాక్టర్లతో పాటు వారి కుటుంబాలకు జీవిత బీమా కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఐఎంఏ కోరింది. logo