శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 19, 2020 , 22:02:57

80 ఏండ్ల వృద్ధ మహిళకు స్విస్ బ్యాంకులో 200 కోట్లు

80 ఏండ్ల వృద్ధ మహిళకు స్విస్ బ్యాంకులో 200 కోట్లు

న్యూఢిల్లీ : ఓ 80 ఏళ్ల వృద్ధ మహిళకు స్విస్ బ్యాంక్ ఖాతాలో సుమారు రూ.196 కోట్ల నల్లధనం ఉన్నట్లు సమాచారం. పన్నుతో పాటు జరిమానా చెల్లించాలని సదరు మహిళకు ముంబైలోని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటాట్) ఆదేశించింది. ఈమె తన నెలసరి ఆదాయంగా కేవలం రూ.14 వేలుగా చూపిస్తుండటం విశేషం.

రేణు తరణి అనే వృద్ధ మహిళకు హెచ్‌ఎస్‌బీసీ జెనీవాలో ఖాతా ఉన్నట్లు సమాచారం. తరణి ఫ్యామిలీ ట్రస్ట్ అనే పేరిట స్విస్ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంది. ఇది 2004 జూలై లో కేమాన్ దీవులకు చెందిన జీడబ్ల్యూ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ప్రారంభించారు. ఈ నిధిని కుటుంబ ట్రస్ట్‌ నిర్వాహకుడిగా బదిలీ చేశారు.

2005-06లో దాఖలు చేసిన తన ఐటీ రిటర్న్‌లో తరణి ఈ సమాచారం ఇవ్వలేదు. ఈ కేసును 2014 అక్టోబర్ 31 న తిరిగి తెరిచారు. తనకు హెచ్‌ఎస్‌బీసీ జెనీవాలో ఎలాంటి బ్యాంక్ ఖాతా లేదని, జీడబ్ల్యూ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లో డైరెక్టర్ లేదా వాటాదారు కాదని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆమె తనకు తాను ఎన్నారైగా పేర్కొన్నది. 

ఇలాఉండగా, ఇదే మహిళ 2005-06 సంవత్సరానికి ఐటీ రిటర్న్స్‌లో తన వార్షిక ఆదాయాన్ని కేవలం రూ.1.7 లక్షలుగా పేర్కొంటూ.. బెంగళూరు చిరునామా ఇచ్చింది. అలాగే తనకు తాను భారతీయ పన్ను చెల్లింపుదారుగా పేర్కొన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ఆమె బ్యాంకు ఖాతాలో రూ.200 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్  గుర్తించలేకపోయింది. ఆమె పబ్లిక్ ఫిగర్ కూడా కాదని, ఈ మొత్తాన్ని ఆమె ట్రస్టుకు ఎలావస్తాయని ధర్మాసనం పేర్కొన్నది.


logo