గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 10:47:47

గ‌నిలో దొరికిన రూ.50 ల‌క్ష‌ల వ‌జ్రం!

గ‌నిలో దొరికిన రూ.50 ల‌క్ష‌ల వ‌జ్రం!

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఓ గ‌నిలో రూ.50 ల‌క్ష‌లు విలువ‌చేసే వ‌జ్రం దొరికింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాలోని రాణిపుర గనిలో ఈ వ‌జ్రం బ‌య‌ట‌ప‌డింది. ఆనందిలాల్ కుష్వాహ అనే వ్య‌క్తి రాణిపుర వజ్రాల గనిలో కొంత భాగాన్ని లీజుకు తీసుకుని త‌వ్వ‌కాలు చేప‌ట్టాడు. ఈ త‌వ్వ‌కాల్లో కుష్వాహకు 10.69 కేరట్ల వజ్రం లభించింది. ఆ వజ్రం విలువ రూ.50లక్షలు ఉంటుందని జిల్లా డైమండ్ ఆఫీసర్ ఆర్కే పాండే చెప్పారు. 

కాగా, అనందిలాల్ కుష్వాహకు ఆ గ‌నిలో వ‌జ్రం ల‌భించ‌డం ఇదే మొద‌టిసారి కాదు. ఈ లాక్‌డౌన్ కాలంలోనే అత‌నికి మ‌రో వ‌జ్రం కూడా దొరికింది. అయితే, గ‌తంలో ల‌భించిన వ‌జ్రం ఇప్పుడు ల‌భించిన‌ వ‌జ్రం అంత  ఖ‌రీదైన‌ది కాద‌ని అధికారులు తెలిపారు. తనకు రెండు వజ్రాలు లభించడం సంతోషంగా ఉందని, తన తోటి కార్మికులతో కలిసి ఇంకా వజ్రాల వేట కొనసాగిస్తానని కుష్వాహ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo