ఆదివారం 28 ఫిబ్రవరి 2021
National - Jan 21, 2021 , 22:01:21

పది లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు: కేంద్రం

పది లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు: కేంద్రం

న్యూఢిల్లీ: సుమారు పది లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కరోనా టీకా కార్యక్రమం కోసం రూపొందించిన కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసినట్లు పేర్కొంది. గురువారం 27 రాష్ట్రాల్లో 1,92,581 మందికి కరోనా టీకా వేసినట్లు తెలిపంది. దీంతో ఇప్పటి వరకు టీకా పొందిన వారి సంఖ్య 9,99,065కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి మనోహర్‌ తెలిపారు. కరోనా టీకా కేంద్రాల సంఖ్య 18,159కి పెరిగినట్లు చెప్పారు. కరోనా టీకాపై భయాలు, అపొహలను తొలగించేందుకు ఐఈసీ ప్రచారాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి

VIDEOS

logo