మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Sep 16, 2020 , 14:20:39

ఒక్క రోజే 1.19 లక్షల మంది విమానాల్లో ప్రయాణం

ఒక్క రోజే 1.19 లక్షల మంది విమానాల్లో ప్రయాణం

న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఈ నెల 15న సుమారు 1.19 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు. మంగళవారం ఒక్క రోజే 1,18,917 మంది విమాన ప్రయాణికులు దేశంలోని పలు గమ్యస్థానాలకు చేరుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ బుధవారం తెలిపింది. దేశవ్యాప్తంగా 2561 విమానాలు ప్రయాణించాయని చెప్పింది. దేశంలోని పలు విమానాశ్రయాల నుంచి 1282 విమానాలు బయలుదేరగా, 1279 విమానాలు చేరుకున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ వివరించింది.

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ వల్ల మార్చి 25 నుంచి నిలిపివేసిన దేశీయ విమాన సర్వీసులను మే 25 నుంచి క్రమంగా పునరుద్ధరించారు. తొలుత నిర్దేశిత మార్గాలు, గమ్యస్థానాలకు పరిమిత సంఖ్యలో విమానాలు నడపగా ప్రస్తుతం ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇంకా పునరుద్ధరించలేదు. అయితే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక విమానాల్లో దేశానికి తరలిస్తున్నారు. ఈ మిషన్ కింద ఇప్పటికే ఐదు దశలు పూర్తి కాగా ఈ నెల 1 నుంచి ఆరో దశ ప్రారంభమైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo