సోమవారం 25 మే 2020
National - Apr 06, 2020 , 07:45:16

మెరిసిన ఎన్డీఆర్ఎఫ్ ఇండియా..వీడియో

మెరిసిన ఎన్డీఆర్ఎఫ్ ఇండియా..వీడియో

  క‌ట‌క్‌  : క‌రోనా మ‌హమ్మారిపై చేస్తున్న యుద్ధానికి సంఘీభావంగా ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు  దేశ ప్ర‌జ‌లంతా లైట్లు ఆర్పేసి..దీపాలు వెలిగించి కేంద్ర‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలకు మ‌ద్ద‌తు ప‌లికారు. ప్ర‌జ‌లు, చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రూ త‌మ త‌మ ఇండ్ల‌లో ఉండి కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు వెలిగించారు. మ‌రోవైపు జాతీయ విపత్తు నిర్వ‌హ‌ణా సంస్థ (ఎన్డీఆర్ఎఫ్) అధికారుల బృందం కాస్త వినూత్నంగా లైట్స్ వెలిగించి..త‌మ సంఘీభావం ప్ర‌క‌టించింది.

క‌ట‌క్‌లోని కార్యాల‌యంలో ఎన్డీఆర్ఎఫ్ ఇండియా పేరుతో డిస్ ప్లే అయ్యేలా..లైట్ల‌ను వెలిగించి క‌రోనా వైర‌స్ త‌రిమికొట్టేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలో చేప‌డుతున్న పోరుకు మ‌ద్ద‌తు ప‌లికింది. logo