సోమవారం 01 జూన్ 2020
National - May 08, 2020 , 21:14:55

వెబ్‌నార్ ద్వారా పాడి రైతుల‌కు ఎన్‌డీడీబీ అవ‌గాహ‌న‌

వెబ్‌నార్ ద్వారా పాడి రైతుల‌కు ఎన్‌డీడీబీ అవ‌గాహ‌న‌

న్యూఢిల్లీ:  కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి స‌మ‌యంలో పాడి ప‌శువుల రైతులు అనుస‌రించాల్సి జాగ్ర‌త్త‌ల గురించి నేష‌న‌ల్ డైరీ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డు(ఎన్‌డీడీబీ) ఇంట‌రాక్టివ్ వెబ్‌నార్‌ను ప్రారంభించింది. రైతులు అనుస‌రించాల్సిన విధానంపై అవ‌గాహ‌న క‌ల్పించారు. పంజాబ్‌, రాజ‌స్థాన్‌, హ‌ర్యానా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, బీహార్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, జార్ఖండ్‌, ఒడిశా, ప‌శ్చిమ‌బెంగాల్‌, ఢిల్లీ, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, అస్సాంకు చెందిన రైతులు, పాల ఉత్ప‌త్తిదారులు వైబ్‌న‌ర్‌లో పాల్గొన్నారు. రైతులు అడిగిన దాదాపు 500కు పైగా ప్ర‌శ్న‌ల‌కు ఎన్‌డీడీబీ నిపుణులు స‌మాధానం ఇచ్చారు. 

ఈ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో, పాడి ప‌శువుల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని ఎన్‌డీడీబీ చైర్మన్ దిలీప్ రాత్ రైతుల‌కు సూచించారు. ప‌శువుల ఆహారం, ఆరోగ్య విష‌యంలో రాజీ ప‌డితే వాటి పున‌రుత్ప‌త్తిపై ప్ర‌భావం చూపి న‌ష్టం జ‌రుతుంద‌ని తెలిపారు. కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు, సాంకేతిక‌త‌కు సంబంధించిన స‌మాచారం పాడి రైతుల‌తో పంచుకునేందుకు కోవిడ్‌-19 అవ‌రోదంగా మార‌కుండా చూసేందుకు ఎన్‌డీడీబీ నిపుణులు కృషి చేస్తున్నార‌ని పేర్కొన్నారు. బోర్డు నిపుణుల‌తో పాడి రైతులు డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్ ద్వారా క‌నెక్ట్ అవ్వాలి. నిపుణులు ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాల‌ని కోరారు. 


logo