బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 13, 2020 , 18:28:12

ఈ నెల 15న బీహార్‌లో ఎన్డీఏ స‌మావేశం.. సీఎం పేరు ఖ‌రారు

ఈ నెల 15న బీహార్‌లో ఎన్డీఏ స‌మావేశం.. సీఎం పేరు ఖ‌రారు

ప‌ట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి పార్టీలు ఈ నెల 15న (ఆదివారం) సమావేశం కానున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్ తెలిపారు. నితీశ్‌కుమార్ నివాసంలో శుక్రవారం బీజేపీ, జేడీయూ, వీఐపీ, హెచ్ఏఎమ్ పార్టీల నేతలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ స‌మావేశంలో త‌దుప‌రి ముఖ్య‌మంత్రి పేరును ఖ‌రారు చేయ‌నున్నారు. 

అయితే, ఎన్డీఏ కూట‌మి స‌మావేశం కంటే ముందే నాలుగు పార్టీలు వేర్వేరుగా శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నాయి. అనంత‌రం కూటమి పార్టీల‌న్నీ స‌మావేశ‌మై త‌దుప‌రి సీఎం పేరును ఖ‌రారు చేయ‌నున్నాయి. అయితే, కూట‌మిలో ప్ర‌ధాన పార్టీ అయిన బీజేపీ ఇప్ప‌టికే నితీశ్‌కుమారే సీఎం అని ప్ర‌క‌టించినందున ఆయ‌న ఎన్నిక లాంఛ‌నం కానుంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.