మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 16:00:49

బీహార్‌లో ఎన్డీయే, ఆర్జేడీ కూటమి మధ్య పోస్టర్ల వార్‌

బీహార్‌లో ఎన్డీయే, ఆర్జేడీ కూటమి మధ్య పోస్టర్ల వార్‌

పాట్నా: బీహార్‌ రాష్ట్రంలో మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార జేడీయూతో కూడిన ఎన్డీయే, ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమి మధ్య పోస్టర్ల వార్‌కు తెరతీసింది. పదేండ్ల కిందట ప్రధాని మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు నాటి బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ఆయనతో కలిసి లంచ్‌ చేసేందుకు నిరాకరించారు. ఈ ఘటన నాడు ఈ ఇద్దరి నేతల మధ్య ఉన్న విభేదాలను స్పష్టం చేసింది. అయితే మారిన పరిస్థితుల్లో బీజేపీతో కలిసి రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకున్నారు నితీశ్‌ కుమార్‌. మరోవైపు ప్రధాని మోదీ ఇటీవల నితీశ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ‘నితీష్‌ భాగస్వామ్యంతో ఏదైనా సాధ్యమే’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ ఆ రాష్ట్రంలో వరుసగా పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. దీంతో మోడీ, నితీశ్‌ది గొప్ప కాంబినేషన్‌ అంటూ వారిద్దరి ఫోటోలతో పోస్టర్లను బీజేపీ ఏర్పాటు చేసింది. అయితే ఇది వాస్తవమే అంటూ గతంలో మోదీ, నితీశ్‌ మధ్య వైరంపై ఆర్జేడీ పోస్టర్లు వెలిశాయి.

మరోవైపు లాలూ పశుగ్రాసం కుంభకోణంపై ఒక పోస్టర్‌ను అధికార పక్షం ఏర్పాటు చేసింది. ‘ఒక అవినీతి కుటుంబం.. బీహార్‌కు భారం’ అని అందులో విమర్శించింది. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే నాటికి అధికార, ప్రతిపక్ష కూటముల మధ్య పోస్టర్ల వార్‌ మరింత తీవ్రస్థాయికి చేరవచ్చని తెలుస్తున్నది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo