శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 10, 2020 , 21:47:46

బిహార్‌లో ఎన్‌డీఏ కూటమి విజయం

బిహార్‌లో ఎన్‌డీఏ కూటమి విజయం

పాట్నా : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికార ఎన్‌డీఏ కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 243 స్థానాలున్న బిహార్‌లో అసెంబ్లీలో మ్యాజిక్‌ఫిగర్‌కు అవసరమైన సీట్ల కన్నా ఎక్కువ సీట్లు సాధించి.. స్పష్టమైన మెజారిటీని సాధించింది. అధికారం చేపట్టేందుకు 122 అసెంబ్లీ స్థానాలు అవసరం కాగా.. నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డీఏ) 124 సీట్లు సాధించింది. మరో ఒక స్థానంలో ముందంజలో ఉంది. ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ 109 స్థానాల్లో విజయం సాధించింది మరొక స్థానంలో ఆధిక్యంలో ఉంది. నితీశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎన్‌డీఏ కూటమికి మహాకూటి చివరి వరకు గట్టిపోటీ ఇచ్చింది. ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లిన ఎల్‌జేపీ కేవలం ఒకే సీటుకు పరిమితమైంది. ఇతరులు ఏడు చోట్ల విజయం సాధించారు. 

ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు 103 స్థానాల్లో ఫలితాలు వెలువడగా.. ఎన్‌డీఏ కూటమి 54, మహాఘట్‌బంధన్‌ 44 చోట్ల విజయం సాధించింది. ఎన్‌డీఏలో బీజేపీ 32, జేడీయూ 19, వీఐపీ 2, హెచ్‌ఏఎం పార్టీ ఒక స్థానాల్లో గెలుపొందగా 69 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాకూటమిలోని ఆర్జేడీ 29, కాంగ్రెస్‌ ఏడు, లెఫ్ట్ పార్టీల అభ్యర్థులు ఎనిమిది మంది విజయం సాధించగా.. 69 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఏఐఎంఐఎం మూడు చోట్ల విజయం సాధించగా మరో చోట ఆధిక్యంలో ఉంది. అలాగే బీఎస్పీ ఒక స్థానంలో విజయం సాధించగా.. మరో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించాడు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.