బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 15, 2020 , 08:54:35

ఇవాళ‌ ఎన్డీయే కూట‌మి స‌మావేశం

ఇవాళ‌ ఎన్డీయే కూట‌మి స‌మావేశం

ప‌ట్నా: ‌బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఎన్డీయే కూట‌మి స‌మావేశం కానుంది. ఇవాళ మ‌ధ్యాహ్నం 12.3ం గంట‌ల‌కు కూట‌మిలోని భాగ‌స్వామ్య‌ప‌క్ష ఎమ్మెల్యేలు ప‌ట్నాలో స‌మావేశం కానున్నారు. శాస‌న‌స‌భా ప‌క్ష‌నేత‌గా నితీశ్ కుమార్‌ను మ‌రోమారు ఎన్నుకుంటారు. బీహార్ అసెంబ్లీలో 243 స్థానాలున్నాయి. మూడు విడుత‌ల్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్షాలైన బీజేపీ, జేడీయూ, హెచ్ఏఎం, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీలు ఉమ్మ‌డిగా పోటీశాయి. కూట‌మిలోని అన్ని పార్టీలు క‌లిపి 125 స్థానాలు సాధించాయి. ఇందులో అత్య‌ధికంగా 74 సీట్ల‌లో విజ‌యం సాధించిన బీజేపీ కూట‌మిలో అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది. మిగిలిన పార్టీలైన జేడీయూ 43 స్థానాల్లో, వీఐపీ 4, హెచ్ఏఎం 4 సీట్ల చొప్పున గెలుపొందాయి. దీంతో త‌మ‌కంటే త‌క్కువ స్థానాల్లో గెలుపొందిన‌ప్ప‌టికీ బీజేపీ నితీశ్ కుమార్‌కే మారోమారు సీఎంగా అవ‌కాశం క‌ల్పించింది. ఈనేప‌థ్యంలో ఈరోజు స‌మావేశ‌మ‌వనున్న ఎన్డీయే కూట‌మి ఎమ్మెల్యేలు నితీశ్‌ను శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఎన్నుకోవ‌డం లాంఛ‌‌న‌మే కానుంది. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష ఆర్జేడీ 75 స్థానాల్లో గెలుపొందింది. అయినా ఆ పార్టీ నేతృత్వంలోని కూట‌మిలో ఉన్న పార్టీలు అనుకున్న‌మేర రాణించ‌లేక‌పోవ‌డంతో అధికారానికి మ‌రోమారు దూర‌మ‌య్యింది.