జార్ఖండ్ సీఎంపై లైంగిక దాడి ఆరోపణ.. నివేదిక కోరిన ఎన్సీడబ్ల్యూ

రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు వ్యతిరేకంగా ముంబైలో నమోదైన లైంగిక దాడి ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్డబ్ల్యూసీ) నివేదిక కోరింది. 2013లో హేమంత్ సోరెన్, సురేష్ నాగ్రే తనపై లైంగిక దాడి చేశారని, దీని గురించి వెల్లడించినందుకు తనను, తన కుటుంబ సభ్యులను బెదిరించారని ముంబైకి చెందిన ఒక మోడల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కొన్ని రోజుల్లోనే ఆ కేసును ఆమె వెనక్కి తీసుకున్నారు. అయితే లైంగిక దాడి గురించి బాధితురాలు ఏడేండ్ల కిందట స్వయంగా లేఖ రాసినట్లు ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ గుర్తు చేశారు. దీనిపై సమగ్ర నివేదికను సాధ్యమైనంత త్వరలో అందజేయాలని మహారాష్ట్ర డీజీపీకి సూచించారు.
కాగా బీజేపీ ఎంపీ నిషి కాంత్ దుబే ఈ ఏడాది జూలైలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ కేసు మాఫీ కోసం సోరెన్ తన సీఎం అధికారాన్ని దుర్వినియోగం చేశారని ట్విట్టర్లో ఆరోపించారు. ముంబై పోలీసులు ఈ కేసుపై తిరిగి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దుబే ఆరోపణలపై స్పందించిన సీఎం హేమంత్ సోరెన్, ఆగస్ట్ 4న రాంచీ కోర్టులో వంద కోట్లకు పరువునష్టం దావా వేశారు. బాధిత మహిళతో ఎలాంటి సెటిల్మెంట్ చేసుకోలేదని, దుబే ట్వీట్ చేసేంత వరకు ఈ కేసు సంగతి తనకు తెలియదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి ట్వీట్లు చేయకుండా దుబేను నిరోధించాలని కోర్టును కోరారు.
మరోవైపు ఈ నెల 21న ఈ కేసుపై కోర్టు విచారణ జరుపనున్నది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డీపీజీ నుంచి ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ నివేదిక కోరడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- కాళేశ్వరం నిర్వాసితులకు ఉత్తమ ప్యాకేజీ
- అమర్నాథ్ యాత్ర కోసం ఏర్పాట్లు షురూ!
- రియల్మీ X7 సిరీస్ విడుదల తేదీ ఖరారు!
- అనైతిక బంధం : సోదరిని కాల్చిచంపిన వ్యక్తి
- అయోధ్యలో మసీదు నిర్మాణ పనులు షురూ..
- ఉర్దూ పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి కొప్పుల
- ర్యాలీలో అపశృతి.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి
- డైరెక్టర్ సాగర్ చంద్రనా లేదా త్రివిక్రమా..? నెటిజన్ల కామెంట్స్
- భూమిపై రికార్డు వేగంతో కరుగుతున్న మంచు
- బుద్ధిలేనోడే ఆ ఆల్‌రౌండర్‌కు రూ.10కోట్లు చెల్లిస్తారు!