బుధవారం 20 జనవరి 2021
National - Nov 28, 2020 , 12:34:18

కరోనాతో ఎన్సీపీ ఎమ్మెల్యే మృతి

కరోనాతో ఎన్సీపీ ఎమ్మెల్యే మృతి

ముంబై: మహారాష్ట్రంలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన ఎమ్మెల్యే భరత్‌ భల్కే కరోనా అనంతర సమస్యలతో మరణించారు. గతంలో కరోనా బారిన పడిన ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే మళ్లీ ఆరోగ్య ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన పుణెలోని రూబీ దవాఖానలో చేరారు. సమస్య తీవ్రమవడంతో నిన్నటి నుంచి వెటీలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషయమించడంతో ఇవాళ ఉదయం కన్నుమూశారు. భరత్‌ భల్యే పండర్‌పూర్‌-మంగళ్‌వేద నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యే మృతిపై మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోప్‌ ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.  


logo