సోమవారం 25 జనవరి 2021
National - Jan 06, 2021 , 01:57:53

డ్రగ్స్‌ కేసులో కన్నడ నటి శ్వేతాకుమారి అరెస్టు

డ్రగ్స్‌ కేసులో కన్నడ నటి శ్వేతాకుమారి అరెస్టు

బెంగళూరు: డ్రగ్స్‌ కేసులో కన్నడ నటి శ్వేతాకుమారిని సోమవారం ముంబైలో మాదకద్రవ్యాల నిరోధక సంస్థ (ఎన్సీబీ) అరెస్టు చేసింది. ముంబైలోని ఓ హోటల్‌పై దాడి చేసినప్పుడు ఆమె పట్టుబడ్డారు. ఎన్సీబీ అధికారులు 400 గ్రాముల మెఫెడ్రోన్‌ (ఎండీ)ను స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి మహారాష్ట్ర, గోవాల్లో డ్రగ్స్‌ సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు దాడులు నిర్వహించారు. ముంబైలోని మీరా రోడ్డులో ఉన్న క్రౌన్‌ బిజినెస్‌ హోటల్‌లో తనిఖీలు నిర్వహించినప్పుడు శ్వేతాకుమారి దొరికారని అధికారులు తెలిపారు. ఆమెపై ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆమె 2015లో విడుదలైన ‘రింగ్‌ స్టార్‌' అనే కన్నడ సినిమాలో నటించారు. 


logo