శనివారం 04 జూలై 2020
National - Jun 19, 2020 , 10:39:18

న‌క్స‌ల్స్ లో క‌రోనా గుబులు.. ఒక‌రికి తీవ్ర జ్వ‌రం

న‌క్స‌ల్స్ లో క‌రోనా గుబులు.. ఒక‌రికి తీవ్ర జ్వ‌రం

రాయ్ పూర్ : క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌తి ఒక్క‌రిని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. న‌క్స‌ల్స్ లో కూడా క‌రోనా గుబులు రేపుతోంది. ఛ‌త్తీస్ గ‌ఢ్‌లోని బ‌స్త‌ర్ జిల్లాలో న‌క్స‌ల్స్ కు క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న ఓ మ‌హిళా న‌క్స‌లైట్ త‌న సొంత గ్రామానికి తిరిగి రాగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

బ‌స్త‌ర్ డివిజ‌న్ లోని న‌క్స‌ల్స్ క్యాంపులోని ఓ మ‌హిళా న‌క్స‌లైట్ కు తీవ్ర‌మైన జ్వ‌రం, జ‌లుబు, ద‌గ్గు వ‌చ్చింది. దీంతో ఆమెను సొంతూరుకు పంపారు. మోడ‌క్ పాల్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని పెడ‌క‌వ్లి గ్రామ స‌మీపంలో మ‌హిళా న‌క్స‌లైట్ సుమిత్రా చెపా(32)ను భ‌ద్ర‌తా సిబ్బంది అరెస్టు చేశారు. ఆమె ర‌క్త న‌మూనాల‌ను క‌రోనా ప‌రీక్ష‌ల కోసం పోలీసులు పంపించారు. గ‌త ప‌ది సంవ‌త్స‌రాల నుంచి ఆమె మావోయిస్టు పీఎల్జీఏ బెటాలియ‌న్ నంబ‌ర్ 1లో యాక్టివ్ మెంబ‌ర్ గా ఉన్నారు. 

 మిగ‌తా వారిలో కూడా ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుండ‌డంతో.. త‌మ ప్రాంతాల‌కు వెళ్లిపోతామ‌ని అగ్ర నాయ‌కుల‌ను అడుగుతున్నారు.  అయితే ఎవ‌రైనా న‌క్స‌ల్స్ క‌రోనా ల‌క్ష‌ణాల‌తో సొంత గ్రామాల‌కు వ‌స్తే త‌మ‌కు సమాచారం అందించాల‌ని పోలీసులు స్థానికులను ఆదేశించారు.  ప్ర‌స్తుతానికి సుమిత్రా పోలీసుల అదుపులో ఉంది. ఆమె వాంగ్మూలం ఆధారంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు. 


logo