గురువారం 03 డిసెంబర్ 2020
National - Sep 24, 2020 , 22:11:36

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి రెచ్చిపోయిన నక్సల్స్‌

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి రెచ్చిపోయిన నక్సల్స్‌

రాజ్‌నంద్‌గావ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలో మరోసారి నక్సల్స్‌ రెచ్చిపోయారు. మోహ్ల పోలీసు స్టేషన్‌ పరిధిలో రోడ్డు నిర్మాణంలో ఉన్న ఐదు వాహనాలకు నిప్పంటించారు. పార్ది-పర్విదిహ్‌ గ్రామాల నడుమ రోడ్డు నిర్మాణానికి తీసుకువచ్చిన వాహనాలను బుధవారం రాత్రి నక్సల్స్‌  దహనం చేశారని ఎస్పీ డి శ్రవణ్‌ తెలిపారు. ఓ చైన్‌ మౌంటెయిన్‌తోపాటు రెండు మిక్సర్‌ వాహనాలు మరో రెండు గ్రేడర్‌ వాహనాలు దహనమైనట్లు ఆయన పేర్కొన్నారు. నక్సల్స్‌ కోసం ప్రత్యేక భద్రతా దళాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయని వెల్లడించారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.