శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 21, 2020 , 17:43:44

జార్ఖండ్‌లో వ్యక్తిని కాల్చి చంపిన నక్సల్స్‌

జార్ఖండ్‌లో వ్యక్తిని కాల్చి చంపిన నక్సల్స్‌

ఛత్రా : జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో నక్సల్స్‌ ఓ వ్యక్తిని కాల్చి చంపారు. పథాల్‌గడ పోలీస్‌ స్టేషన్‌  పరిధిలోని ఛట్‌ ఘాట్‌ వద్ద శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతుడిని ముఖేశ్‌ గిరిగా పోలీసులు గుర్తించారు. ఘాట్ వద్ద జనాలు ఛట్‌ వేడుకలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని జార్ఖండ్‌ పోలీస్‌ అధికార ప్రతినిధి సాకేత్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు.

ముఖేశ్‌ గిరిని నక్సల్స్‌ ఎందుకు చంపారన్నది తెలియరాలేదు. పోలీసు కోవర్టుగా వ్యవహరిస్తున్న కారణంగానే ముఖేశ్‌ను నక్సల్స్‌ కాల్చి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘాట్‌ వద్ద భక్తులు ప్రశాంతంగా పూజలు చేసుకుంటున్న సమయంలో కాల్పులు జరగడంతో పలువురు భయాందోళనకు లోనయ్యారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.