గురువారం 09 జూలై 2020
National - Jun 25, 2020 , 10:40:19

ఆరు వాహనాలను తగులబెట్టిన మావోయిస్టులు

ఆరు వాహనాలను తగులబెట్టిన మావోయిస్టులు

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు చెలరేగిపోయారు. ఆరు వాహనాలకు నిప్పుపెట్టారు. రోడ్డు నిర్మాణ పనులకు వినియోగిస్తున్న రెండు లారీలు, రెండు జేసీబీలు, రెండు పొక్లైన్లను తగులపెట్టారు. సుక్మా జిల్లాలోని కుకనార్ ప్రాంతంలో బుధవారం ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సీఆర్పీఎఫ్‌ దళాలు ఆ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టాయి. మావోయిస్టుల కోసం విస్త్రృతంగా గాలిస్తున్నాయి.  logo