మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 16:57:11

అటవీశాఖ కార్యాలయాన్ని పేల్చివేసిన నక్సల్స్‌

అటవీశాఖ కార్యాలయాన్ని పేల్చివేసిన నక్సల్స్‌

చైబాసా : జార్కండ్‌లో నక్సల్స్‌ మరోసారి పెట్రేగిపోయారు. చైబాసా జిల్లా ముఫసిల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని అటవీశాఖ కార్యాలయంతోపాటు పక్కనే ఉన్న క్వార్టర్స్‌ను శనివారం రాత్రి  పేల్చివేశారు. అధికారులను హెచ్చరిస్తూ ఇక్కడ ఓ హెచ్చరిక వాల్‌పోస్టర్‌ను సైతం నక్సల్స్‌ అంటించి వెళ్లారు. పేలుడు ధాటికి కార్యాలయం పైకప్పు కుప్పకూలింది. అటవీశాఖ క్వార్టర్స్‌ ఎదుట పార్కు చేసిన కారు పూర్తిగా దగ్ధమైందని పోలీసులు తెలిపారు. రాత్రి 11గంటల నుంచి 12గంటల మధ్య ఈ ఘటన జరిగిందని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని చైబాసా జిల్లా ఎస్పీ ఇంద్రజిత్‌ మెహతా ఆదివారం తెలిపారు. ఈ ప్రాంతంలో నక్సల్స్‌ వ్యతిరేక  ఆపరేషన్‌ కొనసాగుతుందని పేర్కొన్నారు. నక్సల్స్‌ను అణచివేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.    


logo