శుక్రవారం 10 జూలై 2020
National - Jun 03, 2020 , 11:53:19

మావోయిస్టుల దుశ్చర్య.. 11 వాహనాలకు నిప్పు

మావోయిస్టుల దుశ్చర్య.. 11 వాహనాలకు నిప్పు

రాంచీ : జార్ఖండ్‌ లోహర్దాగా జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కిస్కో పోలీసు స్టేషన్‌ పరిధిలోని హిందాల్కో సంస్థ బాక్సైట్‌ గనుల్లో పనుల్లో నిమగ్నమైన 11 వాహనాలకు నిప్పు పెట్టారు. వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ వాహనాలను బీకేబీ, బాలాజీ ట్రాన్స్‌పోర్టుకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. రూ. 5 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు. 

మంగళవారం రాత్రి 11:15 గంటల సమయంలో బాక్సైట్‌ గనుల వద్దకు సుమారు 12 మంది మావోయిస్టులు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడున్న వారిని మావోయిస్టులు నగదు డిమాండ్‌ చేశారు. నగదు ఇవ్వకపోవడంతో.. వాహనాలకు నిప్పు పెట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


logo