శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 10, 2020 , 01:46:16

పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ పేరుతో గ్రామస్థుడి హత్య

పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ పేరుతో గ్రామస్థుడి హత్య
  • ఛత్తీస్‌గఢ్‌లో ఘటన

కొత్తగూడెం క్రైం/ దంతేవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా బార్సూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ గ్రామస్థుడు పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ మావోయిస్టులు హతమార్చారు. బార్సూర్‌లోని కొకేర్‌నార్‌ గ్రామం నుంచి దశరథం అనే వ్యక్తిని శనివారం మావోయిస్టులు అపహరించుకు వెళ్లారు. ఆదివారం ఉదయం మంగనార్‌ పరిధిలో గుఫా చౌక్‌లో ఆ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న బార్‌సూర్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, అక్కడ మావోయిస్టులు అంటించిన పోస్టర్లను స్వాధీనపరుచుకున్నారు. పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తూ మావోయిస్టుల సమాచారాన్ని చేరవేస్తున్నాడనే కారణంతోనే దశరథాన్ని హత్య చేసినట్లు ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.


logo