సోమవారం 25 జనవరి 2021
National - Dec 04, 2020 , 16:56:31

ఎదురుకాల్పుల్లో నక్సల్‌ హతం

ఎదురుకాల్పుల్లో నక్సల్‌ హతం

బీజాపూర్‌ : ఎదురు కాల్పుల్లో నక్సల్‌ మృతిచెందాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా గంగలూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధి అటవీప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌, సీఆర్‌పీఎఫ్‌ అనుబంధ యూనిట్‌ కోబ్రా ఆపరేషన్‌లో పాల్గొంది. హక్వా గ్రామ సమీపంలో గాలింపు చర్యలు చేపట్టగా ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం సంఘటనా స్థలంలో పరిశీలించగా ఓ మృతదేహం లభించింది. మృతుడిని మావోయిస్టు గంగలూరు ఏరియా కమిటీ మిలిషియా ప్లాటూన్‌ కమాండర్‌ అర్జున్‌గా గుర్తించారు. భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్‌ ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. 


logo