శనివారం 06 మార్చి 2021
National - Jan 16, 2021 , 21:22:51

తలపై రూ.8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు మృతి

తలపై రూ.8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు మృతి

రాయ్‌పూర్‌: తలపై రూ.8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలోని కుత్రు, కేతుల్‌నార్ ప్రాంతాల మధ్య అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం 4:30 గంటల సమయంలో నక్సల్స్, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు బీజాపూర్‌ ఎస్పీ కమలోచన్ కశ్యప్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 లక్షల రివార్డు ఉన్న ఒక మావోయిస్టు చనిపోయినట్లు వెల్లడించారు. ఆ ప్రాంతంలో కూంబింగ్‌ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo