బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 07:49:48

లఢక్‌లో పొసీడన్‌-8ఐ మోహరింపు

లఢక్‌లో పొసీడన్‌-8ఐ మోహరింపు

న్యూఢిల్లీ: శక్తిమంతమైన పొసీడన్‌ 8ఐ బహుళ ప్రాయోజిక యుద్ధ విమానాలను భారత నౌకాదళం తూర్పు లఢక్‌లో వాస్తవాధీన రేఖ వెంట మోహరించింది. ఈ సబ్‌మెరైన్‌ విధ్వంసక యుద్ధవిమానాలు సరిహద్దుల్లో శత్రుసేనల కదలికలపై నిఘా పెట్టడంలో చురుకైన పాత్ర పోషిస్తాయి. చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో నేవీ ఇప్పటికే మిగ్‌-29కే విమానాలను మోహరించింది. వాటితోపాటు వాయుసేన సుఖోయ్‌ ఎంకేఐ 30, జాగ్వార్‌, మిరేజ్‌-2000 యుద్ధ విమానాలను కూడా సిద్ధంగా ఉంచింది.


logo