బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 02:12:02

అండమాన్‌లో నేవీ విన్యాసాలు

అండమాన్‌లో నేవీ విన్యాసాలు

న్యూఢిల్లీ, జూలై 18: చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఇండియన్‌ నేవీ భారీ యుద్ధ విన్యాసాలను నిర్వహిస్తున్నది. దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన సూపర్‌ ఎయిర్‌క్రాప్ట్‌ క్యారియర్స్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తున్న సమయంలోనే భారత్‌ ఈ విన్యాసాలు చేపడుతుండడం గమనార్హం. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, సముద్ర గస్తీ యుద్ధ విమానాలు ఈ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. మలక్కా జలసంధి సమీపంలో మోహరించిన పలు యుద్ధనౌకలు కూడా ఈ విన్యాసాల్లో భాగమైనట్లు సమాచారం.  

పీపీ15 నుంచి చైనా ఇంకా వెనక్కి వెళ్లాలి

తూర్పు లఢక్‌లోని హాట్‌స్ప్రింగ్స్‌లో పెట్రోలింగ్‌ పాయింట్‌ 15 (పీపీ15) నుంచి చైనా బలగాలు ఇంకా  వెనక్కి మళ్లాల్సి ఉన్నదని అధికారవర్గాలు వెల్లడించాయి. ఇప్పటికీ వాస్తవాధీన రేఖకు భారత్‌ వైపున 1.5 కిలోమీటర్ల మేర భూభాగంలో చైనా బలగాలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి. మేలో చైనా సైన్యం దాదాపు 5 కిలోమీటర్ల మేర భారత్‌వైపునకు చొచ్చుకొచ్చింది. 


logo