శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 00:47:20

సముద్రంలో కూలిన మిగ్‌-29కే

సముద్రంలో కూలిన మిగ్‌-29కే
  • గోవాలో ఘటన.. సురక్షితంగా బయటపడ్డ పైలట్‌

పనాజీ: భారత నౌకా దళానికి చెందిన మిగ్‌-29కే యద్ధ విమానం గోవా తీరంలోని అరేబియా సముద్రంలో ఆదివారం ఉదయం కూలిపోయింది. పైలట్‌ సురక్షితంగా బయటపడ్డాడని, ఘటనపై విచారణకు ఆదేశించినట్టు నౌకాదళ అధికార ప్రతినిధి తెలిపారు.  దక్షిణ గోవాలోని వాస్కోలో ఐఎన్‌ఎస్‌ హంసా బేస్‌ నుంచి బయల్దేరిన రోజువారీ శిక్షణ విమానం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో సాంకేతిక లోపం కారణంగా  కూలిపోయిందని, రెండు ఇంజిన్లు, ఒక సీటు ఉన్న ఈ విమానంలోని పైలట్‌ సురక్షితంగా బయటపడ్డాడన్నారు. దక్షిణ గోవా జిల్లాలోని వెర్నా గ్రామం వెలుపల గత నవంబర్‌ 16న కూడా ఓ మిగ్‌-29కే విమానం కూలిపోయింది. గత మూడు నెలల్లో ఇది రెండో ప్రమాదం అని అధికారి తెలిపారు. logo