గురువారం 21 జనవరి 2021
National - Dec 04, 2020 , 13:23:46

నేవీ డే విన్యాసాలు రద్దు... ఇదే కారణం...!

 నేవీ డే విన్యాసాలు రద్దు... ఇదే కారణం...!

అమరావతి: పాకిస్తాన్‌పై  భారత్ విజయానికి సూచికగా ఏటా నిర్వహించే నేవీ డే విన్యాసాలు ఈ సంవత్సరం సాదాసీదాగా నిర్వహిస్తున్నారు.  తూర్పు తీరం నుంచి బయలుదేరిన యుద్ధనౌకలు కరాచీ పోర్టును స్వాధీనం చేసుకోవడం ద్వారా డిసెంబర్ 4వ తేదీన భారత్ విజయం సాధించింది. దీనికి గుర్తుగా ప్రతి ఏటా విశాఖ తెరువు తూర్పు నౌకాదళం ఇండియన్ నేవీ డే విన్యాసాలు భారీ ఎత్తున జరుగుతుంటాయి. అయితే కరోనా నిబంధనల నేపథ్యంలో ఎటువంటి విన్యాసాలు నిర్వహించలేదు.

కేవలం డిసెంబర్ 4న  సాయంత్రం విశాఖ తీరంలో యుద్ధ నౌకలపై విద్యుద్దీపాలు అలంకరించి నేవీ డే కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ దశలో విశాఖ బీచ్లో ఉండే విక్టరీ ఎట్ సీ స్తూపం వద్ద తూర్పు నౌకా దళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ జైన్ పూలమాలవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు. శత్రుదేశాలతో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుందని ఆయన అన్నారు.

 లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo