బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 22, 2020 , 22:03:24

నౌకా దళం సన్నద్ధతపై నేవీ చీఫ్‌ సమీక్ష

నౌకా దళం సన్నద్ధతపై నేవీ చీఫ్‌ సమీక్ష

న్యూఢిల్లీ: భారత నౌకా దళం సన్నద్ధతను నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ సమీక్షించారు. విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యతోపాటు ఇతర యుద్ధ నౌకలను గురువారం ఆయన హెలీకాప్టర్‌లో సందర్శించారు. పశ్చిమ నేవీ ఫ్లీట్‌ కార్యాచరణ, పోరాట సన్నద్ధతపై నేవీ అధికారులతో చర్చించారు. లఢక్‌ సరిహద్దులో చైనాతో ఉద్రిక్తల నెలకొన్న తరుణంలో కరంబీర్‌ సింగ్‌ ఆకస్మిక పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. వచ్చే నెలలో భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్టేలియా దేశాలకు చెందిన యుద్ధ నౌకలు మలబార్‌ విన్యాసాల్లో పాల్గొననున్నాయి. దీని ఏర్పాట్ల గురించి కూడా కరంబీర్‌ సింగ్‌ చర్చించినట్లు సమాచారం. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.