గురువారం 04 జూన్ 2020
National - May 13, 2020 , 14:22:14

టిక్‌టాక్‌లో చేరిన న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ

టిక్‌టాక్‌లో చేరిన న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ


హైద‌రాబాద్‌: మాజీ క్రికెట‌ర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ.. ఇప్పుడు టిక్‌టాక్‌లో చేరాడు.  పంచ్ డైలాగ్‌ల‌తో ఆక‌ట్టుకునే మాజీ పంజాబ్ మంత్రి న‌వ‌జ్యోత్‌.. ఇప్పుడు టిక్‌టాక్ ల‌వ‌ర్స్‌ను కూడా థ్రిల్ చేస్తున్నాడు. మాస్ట‌ర్స్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్‌, జాక్ ఆఫ్ న‌న్‌, ఆల్ ఇన్ వ‌న్ అని త‌న ప్రొఫైల్‌కు రాసుకున్నాడు.  టిక్‌టాక్‌లో సిద్ధూ చేర‌గానే అత‌నికి 800 మంది ఫాలోవ‌ర్లు వ‌చ్చారు. ఇటీవ‌లే ఆయ‌న జితేగాపంజాబ్ అన్న ట్విట్ట‌ర్ అకౌంట్‌ను కూడా ఓపెన్ చేశాడు. దానికి ముందు కొన్ని రోజుల క్రితం య్యూట్యూబ్ ఛాన‌ల్‌ను కూడా ఆయ‌న ప్రారంభించాడు. టిక్‌టాక్ యాప్‌లో సిద్ధూ జాయిన్ కావ‌డ‌మే కాదు.. మూడు వీడియోల‌ను కూడా అత‌ను షేర్ చేశాడు. 

 


@navjotsinghsidhuofficial

##navjotsinghsidhuofficial Destination TikTok - Manzil-e-Maqsood ##jittegapunjab

♬ original sound - navjotsinghsidhuofficial


logo