గురువారం 22 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 17:58:42

రైతుల‌కు మ‌ద్ద‌తుగా ఆందోళ‌న‌ల్లో సిద్ధూ

రైతుల‌కు మ‌ద్ద‌తుగా ఆందోళ‌న‌ల్లో సిద్ధూ

అమృత్‌స‌ర్‌: పార్ల‌మెంటు ఆమోదం పొందిన వ్య‌వ‌సాయ బిల్లుల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో రైతులు, ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో పాల్గొంటున్నారు. ఎడ్ల‌బండ్లు, ట్రాక్ట‌ర్‌ల‌తో ర్యాలీల్లో పాల్గొంటున్నారు. భార‌త మాజీ క్రికెటర్‌, పంజాబ్ ఎమ్మెల్యే న‌వ‌జ్యోత్‌సింగ్ సిద్ధూ సైతం రైతుల‌కు మ‌ద్ద‌తుగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో పాల్గొన్నారు. సేవ్ ఫార్మ‌ర్స్ అని రాసి ఉన్న ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించారు. 

న‌రేంద్ర‌మోదీ ప్ర‌భుత్వం రైతు వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తున్న‌ద‌ని సిద్ధూ విమ‌ర్శించారు. రైతు వ్య‌తిరేక వ్య‌వ‌సాయ బిల్లుల‌ను ప్ర‌భుత్వం వెన‌క్కు తీసుకునే వ‌ర‌కు త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. సిద్ధూకు మ‌ద్దతుగా ఆయ‌న మ‌ద్ద‌తుదారులు చాలామంది నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో పాల్గొన్నారు. సిద్ధూతో క‌లిసి ట్రాక్ట‌ర్ల‌తో ర్యాలీ నిర్వ‌హించారు. కాగా, సిద్ధూ రాష్ట్ర క్యాబినెట్ నుంచి వైదొలిగిన త‌ర్వాత ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావ‌డం ఇదే తొలిసారి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo