గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 13:19:37

న‌లుగురు మ‌త్స్య‌కారుల‌ను కాపాడిన నేవీ హెలికాప్ట‌ర్‌

న‌లుగురు మ‌త్స్య‌కారుల‌ను కాపాడిన నేవీ హెలికాప్ట‌ర్‌

చెన్నై: స‌ముద్రంలో మునిగిపోతున్న న‌లుగురు మ‌త్య్స‌కారుల‌ను నౌకా ద‌ళం కాపాడింది. త‌మిళ‌నాడు తీరంలోని రామేశ్వ‌రానికి స‌మీపంలో, పాంబ‌న్ బ్ర‌డ్డికి ద‌క్షిణాన ఉన్న మ‌నాలీ దీవుల్లో ప్ర‌మాద వ‌శాత్తు మునిగిపోతున్న ప‌డ‌వ నుంచి మ‌త్య్స‌కారుల‌ను నేవీ హెలికాప్ట‌ర్ క్షేమంగా తీరానికి చేర్చింది. 

ఆదివారం ఉద‌యం 6.5 గంట‌ల ప్రాంతంలో మ‌నాలీ దీవుల‌కు స‌మీపంలో ఓ ప‌డ‌వ మునిగిపోతున్న‌ద‌ని తీర ర‌క్ష‌క ద‌ళం నుంచి స‌మాచారం అందింద‌ని, వెంట‌నే రంగంలోకి దిగిన నేవీ హెలికాప్ట‌ర్ ఐఎన్ఎస్ ప‌రుండూ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టింద‌ని ఆర్మీ అధికారులు చెప్పారు. ప‌డ‌వ‌లో మొత్తం ఎనిమిది మంది ఉన్నార‌ని, మ‌రో న‌లుగురు చేప‌ల ప‌డ‌వ‌లో తీరానికి చేరార‌ని వెల్ల‌డించారు.logo