బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 18:16:41

ఇలా చేస్తే .....సహజసిద్ధంగా జుట్టు నల్లగా అవుతుంది

ఇలా చేస్తే .....సహజసిద్ధంగా జుట్టు నల్లగా అవుతుంది

హైదరాబాద్: ఒక్కసారి జుట్టు తెల్లగా అవ్వడం మొదలుపెడితే… తిరిగి అది నల్లగా అవ్వడం దాదాపు కష్టమే. అందుకు ఎన్నో కారణాలుంటాయి. అయితే పలు రకాల చిట్కాలు పాటిస్తే జుట్టు నల్లబడుతుంది. సహజసిద్ధంగా జుట్టు నల్లగా అవ్వాలని అనుకుంటున్నారా.. హెయిర్ డై వేసుకున్నప్పుడు ఉండేంత నల్లగా జుట్టు మారకపోయినా కొంతైనా తెలుపు రంగు పోయి కాస్త నలుపు, బ్రౌన్ రంగులోకి మారే అవకాశం ఉంటుంది. హెయిర్ డైలో అమ్మోనియా ఇతర కెమికల్స్ కలుపుతారు. అవి జుట్టుని నాశనం చేస్తాయి. అదే సహజ సిద్ధమైన బాదం నూనె, గోరింటాకు పొడి చక్కగా పనిచేస్తాయి. వీటిలో జుట్టుకి మేలు చేసే గుణాలు చాలా ఉన్నాయి. బాదం నూనెలో విటమిన్ ఏ ,బి, ఈ ఉంటాయి.

ముందుగా ఒక గిన్నెలో నీరు పోసి హెన్నా పొడి కలిపి తర్వాత స్టవ్ వెలిగించి, సిమ్‌లో ఉంచి హెన్నా నీటిని ఉడికించండి. కాసేపు ఉడికాక బాదం నూనెను కొద్దిగా అందులో వెసి బాగా కలపండి. మిశ్రమం కాస్త చిక్కగా అయ్యాక స్టవ్ ఆపేసి గిన్నెను పక్కన పెట్టి చల్లబడనివ్వండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు, వెంట్రుకలకు, కుదుళ్లకు రాసి ఒక అరగంట అలా వదిలేసి ఆరిన తర్వాత షాంపూతో తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికోసారి నాలుగు వారాలు చేస్తే మీకు తేడా కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల జుట్టు బలంగా, ఒత్తుగా, గట్టిగా, మందంగా ఉండటమే కాక సహజసిద్ధంగా నలుపు రంగులోకి మారుతుంది.


logo