గురువారం 09 జూలై 2020
National - Jun 24, 2020 , 21:44:17

30,200 లీటర్ల ఊట బెల్లం ధ్వసం

30,200 లీటర్ల ఊట బెల్లం ధ్వసం

అమరావతి: ఆంద్రప్రదేశ్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ), ఒడిశా పోలీసులు ఈ రోజు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు సరిహద్దు ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో నాటుసారా స్థావరాలపై ముమ్మర దాడులు నిర్వహించారు. 30,200 లీటర్ల ఊట బెల్లం ధ్వసం చేశారు. భారీగా నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరి కొంతమంది ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. నిందితుల కోసం రెండు రాష్ర్టాల పోలీసులు గాలిస్తున్నట్లు ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 


logo