శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 26, 2020 , 17:44:59

ఢిల్లీ అల్లర్లు: రంగంలోకి అజిత్ దోవల్

ఢిల్లీ అల్లర్లు: రంగంలోకి అజిత్ దోవల్

న్యూఢిల్లీ:  ఈశాన్య ఢిల్లీలోని  మౌజ్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. ఘర్షణ జరిగిన ప్రాంతాల్లో పోలీసులు, పారామిలటరీ బలగాలను భారీగా మోహరించారు.  మౌజ్‌పూర్‌కు వెళ్లిన దోవల్‌ అక్కడి పరిస్థితులను స్థానిక పోలీసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి పలు అంశాలపై ఆరా తీశారు.  'శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయి. స్థానిక ప్రజలు భద్రత పట్ల సంతృప్తికరంగానే ఉన్నారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలపై పూర్తి విశ్వాసం ఉంది. పోలీసులు తమ విధులను నిర్వర్తిస్తున్నారని' పేర్కొన్నారు.  ఈ నెల 23 నుంచి తూర్పు, ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్ల ఘటనలో మృతుల సంఖ్య 23కి చేరింది. సుమారు 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.logo