మంగళవారం 26 జనవరి 2021
National - Nov 26, 2020 , 18:35:53

డిసెంబర్ 12న‌ ముగియ‌నున్న జాతీయ పురుషుల హాకీ క్యాంప్

 డిసెంబర్ 12న‌ ముగియ‌నున్న జాతీయ పురుషుల హాకీ క్యాంప్

ఢిల్లీ: భార‌త క్రీడా ప్రాధికారిక సంస్థ (సాయ్) బెంగ‌ళూరు క్యాంప‌స్‌లో జ‌రుగుతున్న జాతీయ పురుషుల హాకీ శిబిరం ఒక వారం ముందుగా డిసెంబర్ నెల 12వ తేదీనే ముగియ‌నున్నది. వాస్త‌వంగా ఈ శిబిరం డిసెంబ‌రు 18న ముగియాల్సి ఉన్నది. పురుషుల సీనియర్ హాకీ జట్టు చీఫ్ కోచ్‌ సిఫారసు మేర‌కు ఈ శిబిరాన్ని

 వారం ముందుగానే ముగించ‌నున్నారు. నాలుగు నెలల నిరంతర శిక్ష‌ణ‌ తరువాత ఈ శిబిరాన్ని డిసెంబ‌రు 12వ తేదీన ముగించి.. జ‌న‌వ‌రి 5వ తేదీ వ‌ర‌కు అంటే మూడు వారాలు అథ్లెట్లకు దీర్ఘ విరామం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

ఈ మూడు వారాల విరామంలో అథ్లెట్లకు చీఫ్ కోచ్ , పురుషుల సీనియర్ టీం సైంటిఫిక్ అడ్వైజర్ పూర్తి చేయడానికి గాను సమగ్ర బలం , కండిషనింగ్ కార్యక్రమం నిర్వ‌హించ‌నున్నారు. కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన తరువాత భారత పురుషుల హాకీ జట్టు ఈ ఏడాది ఆగస్టు నుంచి సాయ్  బెంగళూరు కేంద్రంలో శిక్షణను పొందుతున్నది. వచ్చే ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్‌కు జట్టు ఇప్పటికే అర్హత సాధించింది. 

 లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo