సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 14:23:43

యువ బాక్సర్‌ ఆత్మహత్య..!

యువ బాక్సర్‌ ఆత్మహత్య..!

నాగ్‌పూర్‌:  జాతీయ స్థాయి యువ బాక్సర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని అకోలాలో చోటుచేసుకుంది. 19 ఏళ్ల ప్రణవ్‌ రావత్‌ అకోలాలోని తన హాస్టల్‌ రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అతని కోచ్‌ సతీశ్‌చంద్రభట్‌ తెలిపారు.  ప్రణవ్‌ రావత్‌ ఇటీవలే ఢిల్లీలో జరిగిన జాతీయ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌లో పాల్గొన్నాడు. నాగ్‌పూర్‌కు చెందిన ప్రణవ్‌ అకోలాలోని క్రీడా అకాడమీలో గత కొన్ని రోజులుగా శిక్షణ తీసుకుంటున్నాడు. శుక్రవారం (నేడు) అకోలాలో జరిగే ఓ టోర్నమెంట్‌లో పాల్గొనాల్సి ఉంది. ఆరోగ్య కారణాల వల్ల అతడు టోర్నమెంట్‌కు రాలేదు. ప్రణవ్‌ రావత్‌ నిన్న అకాడమీ శిక్షణా తరగతులకు కూడా హాజరవలేదని భట్‌ వెల్లడించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రణవ్‌ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


logo