సోమవారం 18 జనవరి 2021
National - Jan 14, 2021 , 07:48:28

తమిళనాడులో సంక్రాంతి వేడుకల్లో జాతీయ నేతలు

తమిళనాడులో సంక్రాంతి వేడుకల్లో జాతీయ నేతలు

చెన్నై : తమిళనాడులో గురువారం జరిగే సంక్రాంతి వేడుకలకు పలువురు జాతీయ నేతలు హాజరుకానున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన నేతలు తమిళనాడులో జరిగే సంప్రదాయ పండుగకు హాజరవుతుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో పాటు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పాల్గొననున్నారు. చెన్నై మధురవోయల్‌లో జరిగే సంబురాల్లో జేపీ నడ్డాతో పాటు పార్టీ నేత మురుగన్‌ పాల్గొన్ననున్నారు. అలాగే పార్టీ నేతలతోనూ సమావేశం కానున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ చెన్నైలోని మూలకాడై సమీపంలో జరిగే వేడుకల్లో పాల్గొని అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఎన్నికలకు ముందు భగవత్ పర్యటన వెనుక రాజకీయ ఉద్దేశాలను ఆపాదించడంపై ఆర్ఎస్ఎస్ వర్గాలు ఖండించాయి. మధురై జిల్లా అవన్యపురంలో జరిగే జల్లికట్టు ఉత్సవంలో రాహుల్‌ గాంధీ పాల్గొని, వీక్షించనున్నారు. ఆయన రాకతో కాంగ్రెస్‌‌తో పాటు డీఎంకే నేతలు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళ ప్రాచీన సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టును వీక్షించేందుకు రాహుల్‌ వస్తుండడం వచ్చే ఎన్నికల్లో తమకు కలిసొచ్చే అంశంగా రెండు పార్టీలు భావిస్తున్నాయి.