మంగళవారం 26 జనవరి 2021
National - Dec 18, 2020 , 18:00:46

త‌మిళ‌నాడు స‌ర్కారుకు NHRC నోటీసులు

త‌మిళ‌నాడు స‌ర్కారుకు NHRC నోటీసులు

న్యూఢిల్లీ: త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘం (NHRC) నోటీసులు జారీచేసింది. త‌మిళ‌నాడులోని కాంచీపురం వ్య‌వ‌సాయ‌శాఖ కార్యాల‌యంలో టాయిలెట్‌ల సౌకర్యం క‌ల్పించ‌క‌పోవ‌డంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆ నోటీసుల‌లో ఆదేశించింది. కాంచీపురం వ్య‌వ‌సాయశాఖ కార్యాల‌యంలో మరుగుదొడ్ల సౌక‌ర్యం లేక‌పోవ‌డం కార‌ణంగా ఈ నెల 7న అదే కార్యాల‌యంలో వేర్‌హౌస్ మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తున్న ఒక మ‌హిళ ప్రాణాలు కోల్పోవాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో కాంచీపురం వ్య‌వ‌సాయ శాఖ కార్యాల‌యంలో మ‌రుగుదొడ్ల సౌక‌ర్యం ఎందుకు క‌ల్పించ‌లేద‌ని ప్ర‌శ్నిస్తూ NHRC త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి నోటీసులు ఇచ్చింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo